ప్రభాస్.. అభిమానులే కాదు.. ప్రేక్షకులు, సినీ వర్గాలు సైతం 'డార్లింగ్' అని ముద్దుగా పిలుచుకునే స్టార్ హీరో. ఎంత ఎదిగినా ఒదిగే గుణంతోపాటు అందరితో అప్యాయంగా మెలగడమే అందరికీ 'డార్లింగ్' అయ్యేలా ప్రభాస్‌ని చేసిందటనంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. జీవితంలో స్నేహబంధానికి ప్రభాస్ ఏ స్థాయి విలువనిస్తారని చెప్పడానికి అనేక సందర్భాలున్నాయి.
Friday, 23 October 2015
రవితేజ 'ఎవడో ఒకడు' ప్రారంభం
రవితేజ
హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వేణు శ్రీరామ్
దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఎవడో ఒకడు'. ఈ సినిమా
గురువారం హైదరాబాద్‌లో ప్రారంభోత్సవం జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి
అతిథిగా విచ్చేసిన దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, హరీష్ శంకర్
కెమెరా స్విచాన్ చేశారు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
Wednesday, 21 October 2015
డ్యాన్స్ తో అదరగొడుతున్న తమన్నా...
రవితేజ ‘బెంగాల్ టైగర్’ ట్రైలర్ అదరగొడుతోంది :Bengal Tiger Posters
మాస్ మహరాజ రవితేజ ఎనర్జిటిక్ గా చేస్తున్న చిత్రం
బెంగాల్‌టైగర్. సంపత్ నంది దర్శకుడు. అందాల ముద్దుగుమ్మలు తమన్నా, రాశి
ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే
వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచివున్న నిర్మాణసంస్థ
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కె
కె రాధామోహన్ నిర్మాత.
Monday, 28 September 2015
నవంబర్ 5న ''బెంగాల్ టైగర్ ''రిలీజ్
నవంబర్ 5న ''బెంగాల్ టైగర్ ''రిలీజ్ రవితేజ కథానాయకుడిగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రంలో తమన్నా,రాశీ ఖన్నా కథానయికలు. సంపత్ నంది దర్శకత్వంలో,కె.కె. రాదామోహన్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ 17న ఆడియోను రిలీజ్ చేసి,నవంబర్ 5న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటనలో తెలిపారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ..
Sunday, 27 September 2015
అతను అంటే 'బెంగాల్' కే పులీ..!
రవితేజ మాస్ యాంగిల్ తో మరో సినిమా రాబోతుంది. రవితేజ కథానాయకుడిగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రంలో తమన్నా,రాశీ ఖన్నా కథానయికలు. సంపత్ నంది దర్శకత్వంలో,కె.కె. రాదామోహన్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు.see more..
Saturday, 8 August 2015
ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే
అందాన్ని మించిన చంద్రుడు...అందరి మనుస్సును దోచే ఇంద్రుడు...ఒక నవ్వుతో వేలకట్టలేని సంతోషాన్ని పంచే మహేష్ పుట్టినరోజు సందర్భంగా...
తండ్రికి తగ్గ తనయులుంటారు. వారు నాన్న పేరు నిలపడమే కాకుండా, సొంత టాలెంట్ తో రాణిస్తారు కూడా. అలా తండ్రికి తగ్గ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణకు నిజమైన వారసుడనిపించుకున్న మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. నట కుటుంబంలో పుట్టిన మహేష్ బాబు కూడా చిన్నప్పుడే నటుడయ్యాడు.
తనకు అయిదేళ్ల ప్రాయంలోనే మహేష్ బాబు నీడ అనే పిక్చర్ లో యాక్ట్ చేశాడు. మహేష్ లోని నటుడిని గమనించిన హీరో కృష్ణ అతన్ని ప్రోత్సహించాడు. బాలనటుడిగా మహేష్ ముగ్గురు కొడుకులు వంటి సినిమాల్లో చేశాడు. వయసు వచ్చాక మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అతను యాక్ట్ చేసిన ఒక్కడు వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఆ పిక్చర్ చాలా ఇండియన్ లాంగ్వేజెస్ లో వచ్చింది. తర్వాత మహేష్ బాబు వరస హిట్స్ కొడుతూ వస్తున్నాడు.
అతడు, పోకిరి వంటి సినిమాలు మహేష్ బాబుకు ఇంటర్నేషనల్ ఫేం తెచ్చిపెట్టాయి. ఇక బిజినెస్ మేన్, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు దేశవిదేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. మహేష్ నటించిన కొన్ని సినిమాలు అవార్డుల పంట పండించాయి. మహేష్ ఉత్తమ నటుడి అవార్డులూ అందుకున్నాడు.
Tuesday, 28 July 2015
Subscribe to:
Posts (Atom)