రవితేజ
హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వేణు శ్రీరామ్
దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఎవడో ఒకడు'. ఈ సినిమా
గురువారం హైదరాబాద్‌లో ప్రారంభోత్సవం జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి
అతిథిగా విచ్చేసిన దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, హరీష్ శంకర్
కెమెరా స్విచాన్ చేశారు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ''భద్ర' సినిమా తర్వాత రవితేజతో చేస్తున్న చిత్రమిది. మా బ్యానర్లో వేణు శ్రీరామ్ 'ఓ మై ఫ్రెండ్' అనే హిట్ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం కూడా హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం,రిచర్డ్ ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 'అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. దిల్‌రాజు బ్యానర్కిది మరో పెద్ద హిట్ చిత్రమవుతుంది' అని రవితేజ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ, 'రవితేజతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రవితేజ స్టయిల్లో ఉండే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, డైలాగ్స్: రమేష్, గోపీ, ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: రమణ వంక.

No comments:
Post a Comment