గోదావరి పుష్కరాలకు చాలా చరిత్ర ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా రాజమండ్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాజమండ్రి పూర్వపు పేరు రాజమహేంద్రి. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడికి విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్రగోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.