
మాస్ మహారాజ రవితేజ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు 90వ దశకంలో సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టిన రవితేజ
ఈరోజు
ఇండస్ట్రీ లో పేరొందిన హీరోలలో ఒకరు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చాలా
కష్టపడ్డారు. “ఇడియట్” మరియు “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” వంటి చిత్రాలతో
పూరి జగన్నాథ్ రవితేజ కెరీర్ కి బాగా సహాయపడ్డారు. “వెంకి”,”విక్రమార్కుడు”
మరియు “దుబాయ్ శీను” వంటి చిత్రాలతో మాస్ లో తనకంటూ ఒక క్రేజ్
తెచ్చిపెట్టుకున్నారు. తరువాత కొద్దిగా వెనకబడినా సురేందర్ రెడ్డి “కిక్”
చిత్రంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఎవడో ఒక్కడు చిత్రం తెరకెక్కుతుతుంది. ఈ చిత్రం పై ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు.