News

Title

joel sutherland

Tuesday, 14 July 2015

పుష్కర ఘాట్ కు ఘ‌న నీయ‌మైన చ‌రిత్ర

గోదావరి పుష్కరాలకు చాలా  చ‌రిత్ర ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా రాజమండ్రికి చాలా ప్రాముఖ్యత ఉంది.  రాజమండ్రి పూర్వపు పేరు రాజమహేంద్రి. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడికి విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్రగోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

కోటిలింగాలే అతిపెద్ద పుష్క‌ర ఘాట్‌

గోదావ‌రి పుష్క‌రాల‌ను పుర‌స్క‌రించుకుని రాజ‌మండ్రిలోని కోటిలింగాల ఘాట్‌ను 1.20 కిలోమీట‌ర్ల మేర విస్త‌రిస్తున్నారు. ఈ ఘాట్ నిర్మాణం పూర్త‌యితే దేశంలోనే అతిపెద్ద ఘాట్‌గా గుర్తింపు పొందుతుంది. గంగాన‌దిపై వార‌ణాసి, అల‌హాబాద్‌, గోదావ‌రిపై నాసిక్‌లో మాత్ర‌మే పెద్ద ఘాట్‌లున్నాయి. వాటికంటే పెద్ద‌ఘాట్‌ను నిర్మించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం రూ.12.85 కోట్లు కేటాయించింది. రాజ‌మండ్రి కోటిలింగాల రేవు నుంచి చింత‌ల‌రేవు వ‌ర‌కు ఘాట్ నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. సాగునీటి పారుద‌ల శాఖ ఆద్వ‌ర్యంలో సాగుతున్న ఘాట్ నిర్మాణాన్నిమే నెలాఖ‌రునాటికి పూర్తి చేయాల‌ని అధికారుల ల‌క్ష్యం. గోదావ‌రి పుష్క‌రాల్లో దాదాపు ఐదు కోట్ల‌మంది భ‌క్తులు పుణ్య స్నానాలు చేస్తార‌ని అధికారుల అంచ‌నా.

                        భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూసేందుకు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఇపుడున్న పుష్క‌ర ఘాట్ ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయ‌డానికి, విస్త‌రించ‌డానికి, కొత్త‌వాటిని నిర్మించ‌డానికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. అన్నింటికంటే రాజ‌మండ్రి కోటిలింగాల ఘాట్ వ‌ద్ద అత్య‌ధిక ర‌ద్దీ ఉంటుంద‌ని భావించిన ప్ర‌భుత్వం అతిపెద్ద ఘాట్ నిర్మాణాన్ని చేప‌ట్టింది. రాజ‌మండ్రి చుట్టుప‌క్క‌ల నిర్మిస్తున్న ఘాట్‌ల ప‌నులు కంటే కోటిలింగాల ఘాట్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ ఘాట్ పొడ‌వునా ఆరు స్వాగ‌త ద్వారాలు ఏర్పాటు చేయ‌డ‌మేగాక ప్ర‌త్యేక లైటింగ్‌తో అందంగా తీర్చిదిద్దాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కోటిలింగాల ఘాట్ నిర్మాణం ఎంత వేగంగా జ‌రుగుతోందో పుష్క‌ర ఘాట్ విస్త‌ర‌ణ ప‌నులు అంత నెమ్మ‌దిగా జ‌రుగుతున్నాయి. రైల్వే పాత వంతెన‌, మూడో వంతెన కింద నుంచి ఈ ఘాట్ నిర్మాణ ప‌నులు జ‌ర‌గాలి. ఇందుకు రైల్వే శాఖ అనుమ‌తి ఇవ్వాల్సి ఉంది. రైల్వే శాఖ నుంచి అనుమ‌తి రాక‌పోవ‌డంతో పనులు ముందుకు సాగ‌డంలేదు. ఈ ఘాట్‌ను 140 మీట‌ర్ల మేర‌కు విస్త‌రించాల్సి ఉంది..

12 దేవాల‌యాలు .....12 రకాల పూజా కార్యక్రమాలు.....

                     జిల్లాలోని మొత్తం 12 దేవాలయాల పరిధిలో పిండ ప్రదానం చేయడానికి మూడు శార్థ మండపాలు ఏర్పాటు చేశారు. పుష్కరఘాట్ల పరిధిలో పోచంపాడ్‌లోని రెండు శార్థమండపాలు, కందకుర్తిలో ఒక శార్థమండపం ఏర్పాటు చేశారు.ఇందులో మొత్తం 160 మంది పురోహితులు శార్థకర్మలు నిర్వహిస్తారు. పుష్కర ఘాట్ల పరిధిలో ఉన్న 12 దేవాలయాల వద్ద 12 రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా‌రు.   భ‌క్తుల అవ‌సారాల నిమిత్తం గంగాస్నానం, తదితర  కార్యక్రమాలను నిర్వహించిందేకు ప్ర‌త్యే‌క కార్య‌క్ర‌మాలు ఏర్పా‌టు చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా వారి సేవలను వంతుల వారీగా అన్ని దేవాలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు 281 మంది పురోహితులను కమిటీ ద్వారా ఎంపిక చేశాం. ఉచితంగా పురోహితులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నాం.

 ఘాట్ల పరిధిలో వేదపండితులు..

పుష్కరాల కోసం ప్రత్యేక దీపారాధన, పారాయణం నిర్వహించేందుకు వేద పండితులను కూడా నియమిస్తున్నాం. కందకుర్తి, పోచంపాడ్‌లో మరో ఇద్దరు తడ్‌పాకల్‌లో ఒకరు చొప్పున వేద పండితులను నియమిస్తు న్నాం. ఉదయం 6 గంటలకు పారాయణం, 9 గంటలకు ప్రత్యే క పూజలు, సాయంత్రం 6 గంటల నుంచి దీపారాదన తదితర పూజలను వేద పండితులు నిర్వహిస్తారు.

వీఐపీలకు ప్ర‌త్యే‌క ఏర్పా‌ట్లు ........

కందకుర్తి, పోచంపాడ్, తడ్‌పాకల్ పుష్కరఘాట్లకు ప్రముఖులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ 20 మంది పురోహితులకు ఒక ఇన్‌చార్జి పురోహితున్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రముఖులు పుష్కరఘాట్ల వద్దకు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతే ఆ ఇన్‌చార్జి నా దృష్టికి తీసుకువస్తారు. వెంట‌నే ఆ సమస్యను పరిష్కరించి వీఐపీలకు ఇబ్బంది లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం.

70 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం..

ఈ నెల 14 నుంచి 25 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 పుష్కరఘాట్ల పరిధిలో దాదాపు 60 నుంచి 70 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశముంది. కందకుర్తిలోనే 25 నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత పోచంపాడ్‌లో 25 లక్షలకు పై చిలుకు, తాడ్‌బిలోలీలో నాలుగు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశాలున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.

No comments: