అందాన్ని మించిన చంద్రుడు...అందరి మనుస్సును దోచే ఇంద్రుడు...ఒక నవ్వుతో వేలకట్టలేని సంతోషాన్ని పంచే మహేష్ పుట్టినరోజు సందర్భంగా...
తండ్రికి తగ్గ తనయులుంటారు. వారు నాన్న పేరు నిలపడమే కాకుండా, సొంత టాలెంట్ తో రాణిస్తారు కూడా. అలా తండ్రికి తగ్గ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణకు నిజమైన వారసుడనిపించుకున్న మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. నట కుటుంబంలో పుట్టిన మహేష్ బాబు కూడా చిన్నప్పుడే నటుడయ్యాడు.
తనకు అయిదేళ్ల ప్రాయంలోనే మహేష్ బాబు నీడ అనే పిక్చర్ లో యాక్ట్ చేశాడు. మహేష్ లోని నటుడిని గమనించిన హీరో కృష్ణ అతన్ని ప్రోత్సహించాడు. బాలనటుడిగా మహేష్ ముగ్గురు కొడుకులు వంటి సినిమాల్లో చేశాడు. వయసు వచ్చాక మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అతను యాక్ట్ చేసిన ఒక్కడు వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఆ పిక్చర్ చాలా ఇండియన్ లాంగ్వేజెస్ లో వచ్చింది. తర్వాత మహేష్ బాబు వరస హిట్స్ కొడుతూ వస్తున్నాడు.
అతడు, పోకిరి వంటి సినిమాలు మహేష్ బాబుకు ఇంటర్నేషనల్ ఫేం తెచ్చిపెట్టాయి. ఇక బిజినెస్ మేన్, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు దేశవిదేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. మహేష్ నటించిన కొన్ని సినిమాలు అవార్డుల పంట పండించాయి. మహేష్ ఉత్తమ నటుడి అవార్డులూ అందుకున్నాడు.
టాలీవుడ్ పరిశ్రమ ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునే మహేష్ బాబు మరిన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలనీ, ఇంకెన్నో హిట్స్ ఇవ్వాలనీ కోరుకుందాం. మహేష్ బాబు నటిస్తున్న "శ్రీమంతుడు"రిలీజ్ అయిన విషయం తెలిసిందే..
No comments:
Post a Comment