News

Title

joel sutherland

Sunday 27 September 2015

అతను అంటే 'బెంగాల్' కే పులీ..!

రవితేజ మాస్ యాంగిల్ తో మరో సినిమా రాబోతుంది. రవితేజ కథానాయకుడిగా  శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రంలో తమన్నా,రాశీ ఖన్నా కథానయికలు. సంపత్ నంది దర్శకత్వంలో,కె.కె. రాదామోహన్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు.see more..

Saturday 8 August 2015

ప్రిన్స్‌ మహేష్‌ బాబు బర్త్‌ డే



అందాన్ని మించిన చంద్రుడు...అంద‌రి మ‌నుస్సు‌ను దోచే ఇంద్రుడు...ఒక న‌వ్వు‌తో వేల‌క‌ట్టలేని సంతోషాన్ని పంచే మ‌హేష్ పుట్టి‌న‌రోజు సంద‌ర్భంగా...
తండ్రికి తగ్గ తనయులుంటారు. వారు నాన్న పేరు నిలపడమే కాకుండా, సొంత టాలెంట్ తో రాణిస్తారు కూడా. అలా తండ్రికి తగ్గ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణకు నిజమైన వారసుడనిపించుకున్న మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.   పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. నట కుటుంబంలో పుట్టిన మహేష్ బాబు కూడా చిన్నప్పుడే నటుడయ్యాడు.
తనకు అయిదేళ్ల ప్రాయంలోనే మహేష్ బాబు నీడ అనే పిక్చర్ లో యాక్ట్ చేశాడు. మహేష్ లోని నటుడిని గమనించిన హీరో కృష్ణ అతన్ని ప్రోత్సహించాడు. బాలనటుడిగా మహేష్ ముగ్గురు కొడుకులు వంటి సినిమాల్లో చేశాడు.  వయసు వచ్చాక మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అతను యాక్ట్ చేసిన ఒక్కడు వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఆ పిక్చర్ చాలా ఇండియన్ లాంగ్వేజెస్ లో వచ్చింది. తర్వాత మహేష్ బాబు వరస హిట్స్ కొడుతూ వస్తున్నాడు.
                అతడు, పోకిరి వంటి సినిమాలు మహేష్ బాబుకు ఇంటర్నేషనల్ ఫేం తెచ్చిపెట్టాయి. ఇక బిజినెస్ మేన్, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు దేశవిదేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. మహేష్ నటించిన కొన్ని సినిమాలు అవార్డుల పంట పండించాయి. మహేష్ ఉత్తమ నటుడి అవార్డులూ అందుకున్నాడు. 

Tuesday 28 July 2015

కలాంకు నివాళులర్పించిన క్రికెట్ దిగ్గజం...

మాజీ రాష్ట్రపతి ఏపిజె .అబ్దుల్ కలాంకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మంగళవారం నాడు నివాళులర్పించారు. రాజాజీ మార్గ్ లో మాజీ రాష్ట్రపతి నివాసంలో ఆయన పార్ధివ దేహం వద్ద పాదాల దగ్గర పుష్పగుచ్చాన్ని ఉంచి సంతాంపం తెలిపారు.

 

Thursday 23 July 2015

నేడు అనంతపురంలో రాహుల్ పర్యటన

హైద‌రాబాద్ :నేడు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటించనున్నారు. ఓబులదేవర చెరువు నుంచి దాదాపు 10 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టను న్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో పాటు డ్వాక్రా మహిళలు, విద్యార్ధులను కలుసుకుంటారు. ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా బెంగ ళూరు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన అనంతపురం బయలుదేరుతారు.

పుష్కరాలకు అదనపు బలగాలు

హైదరాబాద్‌:
 గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చే మూడు రోజులు ప్రజల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికార సిబ్బందికి అదనంగా 16 మంది సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారులతో సహా అదనంగా నాలుగు వందల మంది పోలీసు సిబందిని ఐదు జిల్లాల్లో జరిగే పుష్కర ఘాట్లకు తరలిస్తున్నామని డిజిపి అనురాగ్‌ శర్మ తెలిపారు. సీనియర్‌ అధికారుల్లో కొంత మంది ఐపిఎస్‌ అధికారులను కూడా పుష్కరాల బందోబస్తు కోసం నియమించామని డిజిపి చెప్పారు. కాళేశ్వరంలో నెలకొన్న ప్రజల రద్దీని క్రమబద్దీకరించడానికి అదనంగా ఇద్దరు డిఎస్పీలు, నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, పది మంది ఎస్‌ఐలను గురువారం నుంచే విధుల్లో నియమించినట్లు తెలిపారు.  అలాగే హైదరాబాద్‌లోని డిజిపి కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, అక్కడ డిఎస్పీ, కొంత మంది అధికారులు కంట్రోల్‌ రూమ్‌లో 24 గంటలూ విధుల్లో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కరాల తాజా పరిస్థితులను వీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో అన్ని చర్యలు తీసుకుంటారన్నారు. అదనపు డిజిపి రవిగుప్తా నేతృత్వంలో ఈ కంట్రోల్‌రూమ్‌ పనిచేస్తుందని డిజిపి తెలిపారు.

My son ABHAY RAM : Jr.NTR

Telugu Cinema Hero Jr NTR has named his son Abhay Ram.
The actor held a naming ceremony on Sunday for his son, who was born on 22 July at Rainbow Hospital in Hyderabad. "Feeling very happy.just concluded my son ABHAY RAM s naming ceremony," NTRtweeted.
NTR had tied the knot with Lakshmi Pranathi in 2011 and Abhay Ram is the couple's first child. The actor, popularly known as the young tiger of Telugu cinema, took to Twitter after a few years to announce the birth of his son.
"Been away from twitter for a long time.i felt I should tweet today.we are blessed with a baby boy.thanks for all ur blessings.love u all," NTR had tweeted last month.

The entire NTR clan is said to be happy about the arrival of the new member in their family. Several celebrities including music composer Thaman, Priya Mani, Samantha, Pranitha and Manoj congratulated the new parents on their Twitter handles.
On the professional front, Jr NTR is awaiting the release of his upcoming film "Rabhasa." The film, touted to be family drama laced with action, is directed by Santhosh Srinivas. 
"Rabhasa" was expected to hit theatres on 15 August, but the makers delayed the release owing to post-production work.