News

Title

joel sutherland

Thursday 23 July 2015

పుష్కరాలకు అదనపు బలగాలు

హైదరాబాద్‌:
 గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చే మూడు రోజులు ప్రజల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికార సిబ్బందికి అదనంగా 16 మంది సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారులతో సహా అదనంగా నాలుగు వందల మంది పోలీసు సిబందిని ఐదు జిల్లాల్లో జరిగే పుష్కర ఘాట్లకు తరలిస్తున్నామని డిజిపి అనురాగ్‌ శర్మ తెలిపారు. సీనియర్‌ అధికారుల్లో కొంత మంది ఐపిఎస్‌ అధికారులను కూడా పుష్కరాల బందోబస్తు కోసం నియమించామని డిజిపి చెప్పారు. కాళేశ్వరంలో నెలకొన్న ప్రజల రద్దీని క్రమబద్దీకరించడానికి అదనంగా ఇద్దరు డిఎస్పీలు, నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, పది మంది ఎస్‌ఐలను గురువారం నుంచే విధుల్లో నియమించినట్లు తెలిపారు.  అలాగే హైదరాబాద్‌లోని డిజిపి కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, అక్కడ డిఎస్పీ, కొంత మంది అధికారులు కంట్రోల్‌ రూమ్‌లో 24 గంటలూ విధుల్లో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కరాల తాజా పరిస్థితులను వీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో అన్ని చర్యలు తీసుకుంటారన్నారు. అదనపు డిజిపి రవిగుప్తా నేతృత్వంలో ఈ కంట్రోల్‌రూమ్‌ పనిచేస్తుందని డిజిపి తెలిపారు.

No comments: