- జీవితాల ఆధారంగా రూపొందిన చిత్రాలు
దేశం నుంచి పరారై రెండు దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న చీకటి సామ్రాజ్యపు నేత ఛోటారాజన్‌ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకోవడం శుభపరిణామం. ఎన్నో వెండితెర కథలకు గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్ కేంద్రబిందువయ్యాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చీకటి సామ్రాజ్యం, పోలీసు, రాజకీయనేతల సంబంధాల గుట్టు తదితర అంశాలు సినిమాలుగా రూపొందడానికి బాగా దోహదపడ్డాయి. రియల్ గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కి హల్‌చల్ చేసిన కొన్ని చిత్రాల గురించి ఓ లుక్కేద్దాం..
నాయకన్ : ముంబై అండర్‌వరల్డ్ డాన్ వరదరాజన్ ముదలియార్ జీవిత కథని నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు మణిరత్నం 'నాయకన్' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. 1972లో హాలీవుడ్‌లో విడుదలైన 'ద గాడ్‌ఫాదర్' చిత్రం స్ఫూర్తితో ఈచిత్రాన్ని రూపొందించారని అప్పట్లో వార్తలు బాగా వినిపిం చాయి. ఇందులో వేలు నాయకన్‌గా కమల్‌హాసన్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.
అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని సైతం దక్కేలా చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. రియల్ గ్యాంగ్‌స్టర్ జీవిత నేపథ్యంలో రూపొందిన చిత్రంగా విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది.
దయావన్ : 'నాయకన్' చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని బాలీవుడ్‌లో ఫిరోజ్‌ఖాన్ 'దయావన్' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. వినోద్‌ఖన్నా కథానాయకుడిగా నటించిన ఈచిత్రం సైతం బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. సంవత్సరం తేడాతో విడుదలైన 'నాయకన్', 'దయావన్' చిత్రాలు రెండూ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందాయి.
కంపెనీ : చీకటి సామ్రాజ్యం, పోలీసు, రాజకీయ నేతల సంబంధాల గుట్టుపై రామ్‌గోపాల్‌వర్మ సంధించిన అస్త్రం 'కంపెనీ'. గ్యాంగ్‌స్టర్స్ దావూద్ ఇబ్రహీమ్, ఛోటారాజన్ జీవితాల్ని కథా వస్తువుగా తీసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరి ప్రశంసల్ని పొందింది. ముఖ్యంగా డి-కంపెనీ పేరుతో ఇండియాలో పెద్ద ఎత్తున మాఫియాని ఆర్గనైజ్ చేస్తున్న దావూద్ ఇబ్రహీమ్ గురించి వర్మ చూపించిన వైనం అందరిన్నీ విశేషంగా ఆకట్టుకుంది. మాఫియా నేపథ్యంలో రూపొందించిన 'సత్య' తర్వాత వర్మ తెరకెక్కించిన చిత్రమిది. 2002లో విడుదలైన చిత్రాల్లో హయ్యస్ట్ గ్రాస్‌ని కలెక్ట్ చేసిన చిత్రంగా 'కంపెనీ' నిలిచింది. మోహన్‌లాల్, అజరు దేవగన్, వివేక్ ఓబ్రారు, మనీషా కొయిరాలా, ఆంత్రామాలి తదితరుల నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
బ్లాక్ ఫ్రైడే : 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ సంఘటనలతోపాటు 'బ్లాక్ ఫ్రైడే' - ద ట్రూ స్టోరీ ఆఫ్ ద బాంబే బాంబ్ బ్టాస్ట్స్ పేరుతో హుస్సేన్‌జైదీ రాసిన పుస్తకం ఆధారంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ 'బ్లాక్ ఫ్రైడే' చిత్రాన్ని రూపొందించారు. 1993లో ముంబైలో జరిగిన బాంబ్ బ్లాస్ట్స్‌లో దాదాపు 257 మంది చని పోయారు. అతిభయానకంగా జరిగిన ఈ విధ్వంసానికి కారణమైన ముంబై గ్యాంగ్‌స్టర్స్ దావూద్ ఇబ్రహీమ్, టైగర్‌మీనన్‌ల ప్లానింగ్, దాని ఎగ్జిక్యూషన్‌ను అనురాగ్ కశ్యప్ అత్యద్భుతంగా తెరకెక్కించారు. వివాదాస్పద అంశాలతో రూపొందిన కారణంగా మూడేళ్ళపాటు 'బ్లాక్ ఫ్రైడ్'ను ఎక్కడా ప్రదర్శించడానికి వీల్లేదంటూ సెన్సార్‌బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తమ్మీద 2007లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బ్లాక్‌ప్రైడే' విశేష ఆదరణ పొందింది.
ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై
1960-70 సమయంలో ముంబైలో హల్‌చల్ చేసిన ముంబై అండర్‌వరల్డ్ డాన్ హజి మస్తాన్, అతని శిష్యుడు దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్లను ఆధారంగా చేసుకుని దర్శకుడు మిలిన్ లుథ్రియా రూపొందించిన చిత్రం 'ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై'. అజరుదేవగన్, ఇమ్రాన్‌హష్మి, కంగనా రనౌత్, ప్రాచీ దేశారు, రణదీప్ హుడా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈచిత్రం సైతం ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసల్ని కూడా పొందింది.
షూట్ అవుట్ ఎట్ వదాలా
1982లో ముంబైలోని వదాలాలో గల డా||అంబేద్కర్ కాలేజ్ చౌరస్తాలో గ్యాంగ్‌స్టర్ మాన్య సర్వేను ముంబై పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.
ముంబైలో అధికారికంగా పోలీసు రికార్డుల్లో రిజిస్ట్రరైన ఓ వివాదాస్పద ఎన్‌కౌంటర్‌గా ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు. మాన్యసర్వే జీవితకథ ఆధారంతోపాటు 'డోంగ్రీ టు దుబారు' అని హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం ప్రేరణతో దర్శకుడు సంజరుగుప్తా 'షూట్ అవుట్ ఎట్ వదాలా' చిత్రాన్ని రూపొందించారు. గ్యాంగ్‌స్టర్ మాన్య ఒక చదువుకున్న మేథావి. పక్కా ప్లాన్ చేసి దాడులు, విధ్వంసాలు, దొంగతనాలు చేయించే వాడు. వెండితెర రూపంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్య పాత్రను జాన్ అబ్రహం పోషించారు. హిందీ సినిమా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శక, నిర్మాతలు విడుదల చేసి విజయాన్ని సాధించారు.
డి డే : పాకిస్తాన్ బేస్డ్ గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ సేథ్ అలియాస్ గోల్డ్‌మ్యాన్ భారతదేశానికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్. ఇండియాలోని ఎన్నో కేసులతో ఇతనికి ప్రత్యక్ష సంబంధా లున్నాయి. ఇతని నేపథ్యంలో దర్శకుడు నిఖిల్ అద్వాని 'డి డే' చిత్రాన్ని రూపొందించారు. గోల్డ్‌మ్యాన్ పాత్రలో సీనియర్ నటుడు రిషికపూర్ నటించి మెప్పించారు. ముంబైలోని చాలా మంది గ్యాంగ్‌స్టర్ల జీవితా లకు తెర రూపంగా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల్ని పొందింది. అర్జున్ రాంపాల్, శ్రుతిహాసన్, ఇర్ఫాన్‌ఖాన్, హుమాఖురేషి నటించారు.

No comments:
Post a Comment