News

Title

joel sutherland

Wednesday 28 October 2015

మెదడు లేకుండా పుట్టిన శిశువు

http://www.navatelangana.com/mm/20151028//1446068503with%20out%20brain.jpg- రెండేండ్ల వయసులో 'అమ్మా' అని పిలుపు
లనార్క్‌షాయర్‌(స్కాట్లాండ్‌): అమ్మా అనే పిలుపు వినడం ఏ మహిళ జీవితంలోనైనా అపురూప మైనదే. ఆ బుడతడు రెండేండ్ల వయసులో 'అమ్మా' అని పిలిచాడు. మెదడు లేకుండా పుట్టిన తన కొడుకు కొన్ని నిమిషాలు కూడా బతుకుతాడో లేదో అనుకుంటే రెండేండ్ల వయసుకు చేరుకున్నాడు. తల్లిని గుర్తుపట్టి 'అమ్మా' అని పిలిచాడు. మరి సంతోషంగా ఉండదా ఎమ్మాకు. స్కాట్‌లాండ్‌లోని లనార్క్‌షాయర్‌లో నివసించే ఎమ్మా 2013 మార్చి నెలలో ఓ రోజు కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లింది. భరించలేని ఆ నొప్పి అపెండిసైటిస్‌ కావచ్చు అనుకుంది ఎమ్మా.
పరీక్షించిన వైద్యులు పురిటినొప్పులని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ప్రెగెన్సీ అనే అనుమానమే ఆమెకు రాలేదు. ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. అయితే బాబు మెదడుకు సంబంధించిన హౌలోఫ్రాంజెన్సెఫెలీ జబ్బుతో పుట్టాడు. బాబు మెదడులో చిన్న భాగం మాత్రమే ఉంది. దీంతో బాబు మూడు నిమిషాలు లేదా మూడు గంటలు బతకొచ్చని, ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. బాబు అవయవాలు ఎదగవని, మెదడు అభివృద్ధి చెందదని వివరించారు. బాబుకు ఎరాన్‌ అనే పేరు పెట్టింది తల్లి ఎమ్మా. 

No comments: