'నా
సినీ కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూశాను. ఎన్నో విజయవంతమైన
చిత్రాల్ని రూపొందించినప్పటికీ ఇటీవల వచ్చిన గ్యాప్‌ను భర్తీ చేస్తూ మళ్ళీ
జోరు పెంచబోతున్నాను' అని ఎం.ఎస్.రాజు తెలిపారు. ఆయన స్థాపించిన 'సుమంత్
ఆర్ట్ ప్రొడక్షన్' ఈ నెలతో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇండిస్టీలో తనకంటూ
ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న ఎం.ఎస్.రాజు ఇటీవల తనయుడు సుమంత్
అశ్విన్ హీరోగా నటించిన 'కొలంబస్' చిత్రానికి కథ, కథనం అందించారు. ఈ
చిత్ర విజయంతో ఫామ్‌లోకి వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ
విశేషాలు 'నవచిత్రం' పాఠకుల కోసం..
అగ్రస్థాయికి ఎదిగారు..
అగ్రస్థాయికి ఎదిగారు..
25
ఏళ్ల క్రితం అక్టోబర్‌లో 'శత్రువు' సినిమా ప్రారంభంతో సుమంత్ ఆర్ట్
ప్రొడక్షన్‌ను ప్రారంభించాను. అది మంచి ఫలితాన్నిచ్చింది. తర్వాత 'పోలీస్
లాకప్' మంచి పేరు తెస్తే, 'స్ట్రీట్ ఫైటర్' చిత్రం వీధిన పడేసింది. భారీ
విజయం సాధించి 'దేవి' నన్ను నిర్మాతగా
నిలబెట్టింది. 'మనసంతా నువ్వే' బంపర్ హిట్ కాగా 'నీ స్నేహం' ఫర్వాలేదనిపించింది. మహేష్ బాబుతో చేసిన 'ఒక్కడు' బ్లాక్ బాస్టర్ హిట్టై నిర్మాతగా మరింత పాపులర్ చేసింది. ఇక 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' పెద్ద విజయం సాధించింది. ప్రభాస్‌తో చేసిన 'పౌర్ణమి', సిద్ధార్థ్‌తో చేసిన 'ఆట' యావరేజ్‌గా నిలిస్తే రీమేక్ చిత్రం 'వాన' మళ్ళీ బోల్తా పడేలా చేసింది. రామ్‌తో చేసిన 'మస్కా' ఫర్వాలేదనిపించింది. ఇలా ఈ 25 ఏళ్ల సినీ కెరీర్లో విజయాలే ఎక్కువ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఆయా చిత్రాలతో మహేష్‌బాబు, దేవిశ్రీప్రసాద్, ప్రభాస్, ప్రభుదేవా ఇప్పుడు గొప్ప స్థానంలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది.
'దేవి పుత్రుడు' మంచి ప్రయత్నమన్నారు..
నేను నిర్మించిన 'దేవి పుత్రుడు' సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. గ్రాఫిక్స్ పెద్దగా లేని రోజుల్లో వాటర్‌లో మరో ప్రపంచాన్ని చూపిం చడం అంతా ఈజీ కాదు. కొత్తగా చేసిన ఆ చిత్రం మంచి ప్రయోగమని అందరు ప్రశంసించారు. నా సినిమాల్లో వ్యక్తిగతంగా 'మనసంతా నువ్వే', 'దేవి' చిత్రాలు సంతృప్తినిచ్చాయి.
ప్రేక్షకుల్లో ఓపిక తగ్గింది..
నా 25 ఏళ్ల కెరీర్లో ఇండిస్టీలో చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ బాగా అభివృద్ధి అయ్యింది.
3డీ టెక్నాలజీ
వచ్చింది. మేకింగ్ పరంగా అది చాలా కష్టమైనా భవిష్యత్‌లో ఇంకా చాలా సినిమాలు 3డీలో వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రేక్షకుల్లో సహనం మాత్రం తగ్గిపోయింది. ఒకప్పుడు 3గంటల సినిమానైనా ఓపిగ్గా చూసేవాళ్ళు. కాని ఇప్పుడు రెండు గంటల సినిమాను చూడడానికి ఇష్టపడడం లేదు. ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చెప్పగలిగితేనే చూస్తున్నారు. ఏమాత్రం బోర్ కొట్టించినా చూడటం లేదు. తక్కువ నిడివి గల సినిమాలనే కోరుకుంటున్నారు. దీన్ని బట్టి భవిష్యత్‌లో గంట నిడివితోనే సినిమాలు తీయాల్సి వస్తుందేమో. ప్రజంట్ హర్రర్ సినిమాలనే బాగా చూస్తున్నారు. ట్రెండ్ మారింది. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవుతుండాలి.
సుమంత్‌ని మంచి హీరోగా నిలబెట్టాలి..
అమీర్ ఖాన్, కమల్‌హాసన్, అజిత్ లాంటి హీరోలు మొదట లవర్ బారులా, సాఫ్ట్‌గా ఉండే పాత్రలు, చిన్న సినిమాలు చేశారు. తర్వాత క్రమక్రమంగా తమలో మార్పు చేసుకుని ఎదిగారు. ఇప్పుడు ఆయా ఇండిస్టీలలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. మా అబ్బాయి సుమంత్ అశ్విన్‌కి కూడా అదే చెప్పాను. ఆయా హీరోల్లాగానే చిన్నచిన్న సినిమాలు చేసు కుంటూ పోతే నటుడిగా పరిపక్వత వస్తుంది. బాడీలో కూడా మార్పులు వస్తాయి. అప్పుడు మాస్ హీరోగా రాణించవచ్చు. అప్పటివరకు ఓపికతో వెయిట్ చేయాలని చెప్పాను. తనిప్పటివరకు ఆరు సినిమాలు చేశాడు. అందులో నాలుగు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ ఏడాది 'కేరింత', 'కొలంబస్'తో నాకు రెండు విజయాలనందించాడు. ఈ ఆనందంలో అతన్ని మంచి మాస్ హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాను.
'కొలంబస్' విజయం ఉత్సాహనిచ్చింది..
సుమంత్ నటించిన 'కొలంబస్' చిత్ర కథ నా బ్యానర్లో తీసేందుకు రాసుకున్నది. నేను కథ, కథనం అందించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించడం నాకు కొత్త ఉత్సాహానిచ్చింది. సినిమాకిప్పుడు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది.
వచ్చే ఏడాది రెండు భారీ సినిమాలు చేస్తా..
'మస్కా' చిత్రం తర్వాత మా బ్యానర్లో సినిమాలు చేయలేదు. వచ్చే ఏడాది రెండు భారీ ప్రాజెక్టులు చేయడానికి సిద్ధమవుతున్నాను. అందులో ఒకటి మా అబ్బాయితో ఉంటుంది. మరోకటి పెద్ద హీరోతో చేస్తా. అయితే మహేష్‌బాబు ఇటీవల కలిసి మీది చాలా పెద్ద బ్యానర్. మన కాంబినేషన్లో ఓ సినిమాకు ప్లాన్ చేయండి చేద్దామని చెప్పారు. మహేష్‌తో సినిమా ఉన్నా లేకున్నా వచ్చే ఏడాది మాత్రం రెండు భారీ సినిమాలు మా బ్యానర్ నుంచి చేసేందుకు సిద్ధమవుతున్నాను. ఆ రెండు ప్రాజెక్టులూ నేటి ట్రెండ్‌కనుగుణంగా ఉంటాయి.

No comments:
Post a Comment