News

Title

joel sutherland

Thursday, 21 January 2016

రవితేజ తో మరోసారి...ఢీ

 రవితేజ కథానాయకుడుగా దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ‘ఎవడో ఒక్కడు’ సినిమాకు వేణు శ్రీరామ్ దర్సకత్వం వహిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఆమెకు ఇదే మొదటి తెలుగు సినిమా. ప్రకాష్ రాజ్, నాజర్ , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దసరా రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ సినిమా షూటింగ్ ప్రారంభించింది చిత్ర యూనిట్. యూత్‌ని బేస్ చేసుకొని తీస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
రవితేజ కెరీర్‌‌లోనే అత్యంత విజయం సాధించిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘కిక్’ సినిమా అనే చెప్పాలి. మరి ఆ సినిమా విజయంలో రవితేజతో పోటీపడి చేసిన శ్యామ్ కూడా కీ-రోల్ ప్లే చేశాడు. అందుకనే ఇప్పుడు


ఈ సినిమాలో తనతో పోటాపోటీగా ఢీ కొట్టే పాత్రను శ్యామ్ చేతే చేయించాలని చూస్తున్నాడు రవితేజ.

No comments: