టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌ల్లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఓ సూపర్ లక్కీ ఛాన్స్‌ని కొట్టేసింది. ఏకంగా కమల్‌హాసన్ సరసన నటించే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. త్రిష తర్వాత ఈ తరహా అవకాశాన్ని దక్కించుకుంది తమన్నానే అని అందరూ అంటున్నారు. కమల్‌హాసన్ ప్రస్తుతం 'చీకటి రాజ్యం' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రంలో కమల్ సరసన త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ
సినిమా తర్వాత సీనియర్ దర్శకుడు మౌళి రాసిన కథతో కమల్ ఓ సినిమా
చేయబోతున్నారు. ఈ చిత్రానికి కూడా 'చీకటి రాజ్యం' దర్శకుడు రాజేశ్
ఎం.సెల్వానే దర్శకత్వం వహిస్తారట. ఇందులో కమల్‌కి జోడీగా తమన్నాని
తీసుకోవాలని యూనిట్ యోచిస్తోందట. ఇదే విషయాన్ని కమల్ ముందు
ప్రస్తావించగా, ఆయన సైతం గ్రీన్‌సిగల్ ఇచ్చినట్టు సమాచారం. తమన్నా
ప్రస్తుతం నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఊపిరి'
చిత్రంలోను, రవితేజ సరసన 'బెంగాల్ టైగర్'లోనూ నటిస్తోంది.
No comments:
Post a Comment